హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల గౌరవమే నిజమైన రక్షణ: కలెక్టర్

BHPL: రాఖీ పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని పేర్కొన్నారు. ఆడపిల్లల విద్య, స్వావలంబన, సాధికారతకు కుటుంబాలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.