హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మ ఆలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

గద్వాల జిల్లా జమ్మిచేడు గ్రామంలో వెలిసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా పాలగుత్తులు, వెండి ఆభరణాలతో విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు వైభవంగా చేపట్టారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.