KMR: సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వీరయ్య గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన సంతోష్‌కుమార్ కామారెడ్డి సీసీఎస్‌కు బదిలీ కావడంతో వీరయ్యను నియమించారు. ఈ సందర్భంగా సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి ఎస్సైలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వీరయ్య తెలిపారు.
తెలంగాణ
'సదాశివనగర్ సీఐగా వీరయ్య బాధ్యతలు'


