హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో డ్రైవర్ల రక్షాబంధన్‌ వేడుకలు

MDK: రామాయంపేట పట్టణంలో రక్షాబంధన్‌ సందర్భంగా ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. పరస్పరం రాఖీలు కట్టుకుని, స్వీట్లు పంచుకున్నారు. రక్త సంబంధం లేకపోయినా వృత్తిపరంగా ఏర్పడిన అనుబంధాన్ని సోదర బంధంగా భావిస్తూ ఈ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఆటో డ్రైవర్లు తెలిపారు.