AKP: రాఖీ పండగ సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన ఓ కళాకారుడు దార్ల రవి తన సృజనాత్మకతను చాటుకున్నారు. చెక్కను ఉపయోగించి సోదరుడికి సోదరి రాఖీ కడుతున్న దృశ్యాన్ని ప్రతిబింబించేలా 3 అంగుళాల ఎత్తులో కళాఖండాన్ని రూపొందించారు. సోదర-సోదరీమణుల అనుబంధం, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్
రాఖీ పౌర్ణమి కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడు


