NLG: కొండమల్లెపల్లిలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ పసునూరి అనిల్ (26) గుండెపోటుతో మృతిచెందారు. విద్యార్థులను ఇళ్ల వద్ద దింపిన అనంతరం చివరి విద్యార్థి ఇంటి వద్ద వాష్‌రూమ్‌కు వెళ్లి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
తెలంగాణ
గుండెపోటుతో డ్రైవర్ మృతి


