హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి రాఖీ శుభాకాంక్షలు..!

ఖమ్మం: తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతుందని, ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు.