ELR: ఈషా ఫౌండేషన్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వేలేరుపాడు మండలం మల్లారం గిరిజన యువత ప్రథమ స్థానం సాధించి, జాతీయ పోటీలకు ఎంపికైంది. వచ్చే నెల 6న వీరు కోయంబత్తూరులో తలపడనున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారుల ఆర్థిక ఇబ్బందులను గమనించిన పలువురు గిరిజన ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి, వారికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్
'జాతీయ పోటీలకు ఎంపికై వేలేరుపాడు యువత'


