MDK: ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి దివ్యాంబరాలతో అలంకరించారు. శ్రావణ శుక్రవారం విశిష్టతతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంజీరా నదిలో స్నానాలాచరించి, మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
శ్రీ ఏడుపాయల అమ్మవారికి విశేష పూజలు


