హైదరాబాద్: 28°C
తెలంగాణ

15 రోజులు కూడా గడవకముందే ధ్వంసం

NRPT: మక్తల్ పట్టణంలో పరిశుభ్రతను కాపాడేందుకు ఈ నెల 15న ప్రధాన కూడళ్లలో తడి, పొడి చెత్త కోసం చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు. అయితే పాత ఆంధ్రా బ్యాంకు కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెత్తకుండీలను 15 రోజులు గడవకముందే ధ్వంసం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.