హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పౌర్ణమికి 5,000 ప్రత్యేక బస్సులు..!

KNR: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుగు ప్రయాణాల రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.