హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్ట్ ఆఫీస్ వీధిలో పొంచి ఉన్న ప్రమాదం

NLR: ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణమండపం ప్రక్కన పోస్ట్ ఆఫీస్ దారిలో మురుగు కాలువ నిర్మాణ పనులు మలుపు వద్ద అసంపూర్తిగా వదిలివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంది. రోడ్డు కొంత భాగం దెబ్బ తినడంతో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులకు ప్రమాద భయం నెలకొంది. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.