హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

సత్యసాయి: బుక్కపట్నం-ముదిగుబ్బ మండలాల సరిహద్దులో గశికవారిపల్లి సమీపాన గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ముదిగుబ్బ నుంచి 9 మంది ఆటోలో మంగళమడకకు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొందన్నారు. బాధితులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.