హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికారాబాద్ డీఆర్‌ఓ మాళోత్ మంగీలాల్ మృతి

MHBD: వికారాబాద్ జిల్లా డీఆర్‌ఓగా పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవులో ఉన్న మాళోత్ మంగీలాల్ (48) ఖమ్మంలోని తన నివాసంలో గురువారం మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలపాల సమీప తండాకు చెందిన మంగీలాల్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. మూడేళ్ల క్రితం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు.