KKD: తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. సిద్ధాంతపు దేవుడమ్మ పూరి గుడిసెలో వంట చేస్తుండగా గ్యాస్ పొయ్యి నుంచి మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. దీంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లోవ కొత్తూరులో అగ్ని ప్రమాదం


