హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమ వ్యవహారంలో మనస్తాపం.. యువకుడి బలవన్మరణం

WGL: ప్రేమ పేరుతో మోసపోయాననే మనస్తాపంతో యువకుడు పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం సంగెం మండలం కొత్తపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఇమ్మడి శ్రీకాంత్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న యువతి ఇటీవల దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి నవీన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.