WNP: పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయం సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన 30 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్, రవికుమార్‌పై అధికారి పరమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
'అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ.. ఇద్దరిపై కేసు'


