హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 21లోగా ఓటర్ల విచారణ పూర్తి

TPT: కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల విచారణ ప్రక్రియను సెప్టెంబర్ 21లోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 80 శాతం మంది విచారణకు హాజరై సహకరించారని చెప్పారు.