భద్రాద్రి: దమ్మపేట మండలంలోని మందలపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలచెరువుకు చెందిన చందు, రాఘవ, సాంబశివరావు, వీరస్వామి పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌కుమార్ తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి నలుగురు అరెస్ట్


