హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాజీ గుట్ట వద్ద పులి సంచారం..!

NRML: తానూర్ మండలం బోరిగాం సమీపంలోని బాలాజీ గుట్ట వద్ద గురువారం రాత్రి పులి సంచరించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో పులి కనిపించిందని తానూర్ ఎస్ఐ షేక్ జుబేర్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని ఆయన సూచించారు.