హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పెన్షన్‌ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

భద్రాద్రి: జిల్లాలోని కొత్త పెన్షన్‌ మంజూరు కోసం ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు ఆఫీసర్‌, ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ వద్ద దరఖాస్తు సమర్పించి రశీదు పొందాలని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులు అర్హులని ఆయన తెలిపారు.