హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళ్ల గురిజాల రోడ్డుపై పశువుల బెడద..!

MNCL: బెల్లంపల్లి(M) తాళ్ల గురిజాల ప్రధాన రోడ్డుపై రాత్రి వేళల్లో పశువులు గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలకు పశువులు అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు. పశువుల సంచారాన్ని అరికట్టేందుకు అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.