హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి'

MNCL: జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ అలీతో కలిసి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామాల హద్దులు తదితర ప్రాంతాలను సమగ్రంగా సర్వే చేయాలని సూచించారు. ఒక బృందం రోజుకు 30 ఎకరాల వరకు సర్వే చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.