హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్న ప్లాంట్‌కు స్థల పరిశీలన పూర్తి!

PLD: రొంపిచర్ల(M) గోగులపాడు గ్రామంలో ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మొక్కజొన్న ప్రాసెసింగ్ ప్లాంట్‌కు రైతులు ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చిన స్థలాన్ని డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీ రాణి గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం డేవిడ్, మండల ఏపీఎం సోమశేఖర్, సత్యనారాయణ రాజు, వీఓఏ లక్ష్మి, రైతులు శివకోటి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.