ASF: కౌటాల(M) తలోడిలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసును దొంగిలించిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. నిందితులు బాధితురాలి మనుమడు కొంపరి రాము (25),అతనికి సహకరించిన అతని బావ సంచికాల సతీష్‌లు అని తెలిపారు. దొంగిలించిన బంగారు గొలుసును గోదావరిఖనిలోని మణప్పురం ఫైనాన్స్‌లో కుదవ పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
తెలంగాణ
బంగారు గొలుసు చోరీ.. ఇద్దరి అరెస్ట్


