హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భారీగా గంజాయి పట్టివేత'

BHNG: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో ఈగల్ పోలీసులు, చౌటుప్పల్ పోలీసులతో కలిసి గురువారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.