హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేట జిల్లాలో తేలికపాటి వర్షాలు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. హుస్నాబాద్‌లో అత్యధికంగా 9.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సముద్రాలలో 8.3 మి.మీ, సిద్దిపేట అర్బన్‌లో 5.3 మి.మీ చొప్పున వర్షం పడింది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 22°C కు పడిపోగా, గరిష్ట ఉష్ణోగ్రత 34°C గా రికార్డైంది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.