హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ సంబంధిత దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి'

ASF: భూ భారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని CCLA కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల వివరాలను కేటగిరీల వారీగా నమోదు చేయాలని సూచించారు. ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు.