RR: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని జీఎమ్మార్ (GMR) పార్కింగ్ ఏరియాలో అక్రమంగా నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి తరలిస్తున్న 50 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు, మొత్తం 2.5 టన్నులు) నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌తో పాటు డ్రైవర్ అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణ
మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా గుట్కా పట్టివేత


