హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌లో జిల్లాకు నాలుగు పతకాలు

SDPT: హనుమకొండలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అద్భుత ప్రతిభ కనబరిచి ఒక బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకం సాధించారు. మొత్తం నాలుగు పతకాలు దక్కినట్లు సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి కర్రోళ్ల వెంకటస్వామిగౌడ్ తెలిపారు. క్రీడాకారులను సంఘం ప్రతినిధులు అభినందించారు.