హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పండుగ వేళ హెల్మెట్ ధరించండి:ఎస్పీ

SRD: రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిఘా కొనసాగుతుందని, వేధింపులు ఎదురైతే సమాచారం ఇవ్వాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. 'చెల్లి కట్టే రాఖీ రక్షణ బంధం.. హెల్మెట్ ప్రాణ రక్షణ కవచం' అని ఎస్పీ అన్నారు.