హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాయితీ గొప్పదని చాటి చెప్పారు!

RR: షాద్‌నగర్‌లో ఆటోలో మర్చిపోయిన రూ.34,000 నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటో యూనియన్ సభ్యులు నిజాయితీగా కస్టమర్‌కు అప్పగించారు. డబ్బు కంటే నిజాయితీ గొప్పదని చాటిచెప్పిన వారిని, కస్టమర్, స్థానికులు అభినందించారు. ఈ ఘటనతో షాద్‌నగర్ లోకల్ ఆటో యూనియన్‌పై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని పేర్కొన్నారు.