హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

NGKL: నాగర్‌కర్నూల్ బస్టాండ్‌లో నిర్దేశిత సమయాలకు బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కొరతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. సమస్యను వెంటనే పరిష్కరించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.