వరంగల్: చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, రిటైర్డ్ RTC ఉద్యోగి కాసుల నర్సింహాచారీ (76) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. నర్సింహచారి 1969లో చదువుకునే రోజుల్లో జరిగిన తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అనంతరం కుటుంబంతో చెన్నారావుపేటలో స్థిరపడి కండక్టర్ ఉద్యోగం చేశాడు. మృతుడికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
తెలంగాణ
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు మృతి


