హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొగుడంపల్లి శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్

SRD: చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగుడంపల్లి శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.86,840 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.