హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ రాఖీలు తయారు చేసిన విద్యార్థులు

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులు రక్షా బంధన్ సందర్భంగా పాఠశాల ఉపాధ్యా యుల ఫోటోలతో డిజిటల్ రాఖీలు తయారు చేశారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు తమ ఉపాధ్యా యులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యా యులు రాజేందర్ మాట్లాడుతూ.. సోదరభావానికి రాఖీ ప్రతీక అని అన్నారు.