ADB: ఆదిలాబాద్ బస్టాండ్‌లో సెల్ఫోన్ దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ రమేశ్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. పోలీసు ముఖ్య కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. సిబ్బంది పనితీరును అభినందిస్తూ, నేరాల నియంత్రణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
సెల్‌ఫోన్ దొంగకు చెక్..! కానిస్టేబుల్‌కు ఎస్పీ రివార్డ్


