హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

HNK: రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, బాధ్యతలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని పేర్కొన్నారు. ఆడపిల్లల విద్య, స్వావలంబన, సాధికారతకు ప్రతి కుటుంబం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.