హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న డీఈఓ..!

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ ప్రభుత్వ పాఠశాలను డీఈఓ మాధవి గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చదువుతోపాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రాథమిక దశ నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని పేర్కొన్నారు. ఏఎంఓ లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు.