హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం'

పార్వతీపురం మున్సిపల్ ఛైర్మన్ స్థాన రిజర్వేషన్ అనుకూలిస్తే, పార్టీ ఆదేశాల మేరకు వైసీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇండుపూరు గున్నేశ్వరరావు ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం నుంచే తాను క్రియాశీలకంగా పనిచేస్తున్నానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.