హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారుణం.. టీచర్‌పై కత్తి దాడి

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ శ్రీ చైతన్య స్కూల్‌లో పని చేస్తున్న టీచర్‌ అరుణపై కత్తి దాడి జరిగింది. లంచ్ బ్రేక్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి టీచర్‌ను బయటకి పిలిచాడు. గేటు దగ్గరకు రాగానే ఆమె మెడపై కత్తితో దారుణంగా దాడి చేశాడు. దీంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.