హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మోస్తరు వర్షాలు..!

AKP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే, బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.