అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కొండ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి లేకుండా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'నో మైనింగ్ జోన్'గా పంచదార్ల కొండ


