హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్నను దర్శించుకున్న న్యాయమూర్తి

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్పస్తంభం ఆలింగనం చేయించారు. అనంతరం ఆయన అంతరాలయ దర్శనం చేసుకున్నారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేదపండితులు ఆశీర్వచనాలు అందించి ప్రసాదాలు అందజేశారు.