హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు D.y సీఎం పవన్ రాఖీ కానుక

KKD: పిఠాపురం నియోజకవర్గంలో D.y సీఎం పవన్ కల్యాణ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు చీరలు పంపించారు. గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న 45 ఏళ్లలోపు వితంతు, ఒంటరి మహిళలను గుర్తించి, రాఖీ కనుకగా 2,500 మందికి చీరలు పంపించారు. పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలతోపాటు పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాల ద్వారా రాఖీ పండుగ రోజు మహిళలకు పంపిణీ చేయనున్నారు.