హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీ ఆంజనేయులికి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

PLD: వినుకొండ ఇసుక వాగు బజార్‌లోని బ్రహ్మకుమారీస్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రహ్మకుమారీస్ ఆయనకు రాఖీ కట్టి ఆశీస్సులు అందించారు. ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించడంలో బ్రహ్మకుమారీస్ కృషి ప్రశంసనీయమని జీవీ పేర్కొన్నారు.