హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రిని చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు..!

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్‌లో ప్రమాదానికి గురైన తండ్రిని చూసేందుకు వెళ్లిన ఆమె.. తిరిగి వస్తుండగా సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చిన్ని అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త సుధాకర్ గాయాలతో బయటపడ్డారు.