హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

ASR: చింతపల్లిలో శుక్రవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఎస్ఈ విజయానంద్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చు తగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరు మార్పు, తదితర అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.