హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాల సందడి

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దోష నివారణార్థం ఆగమశాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈఈ భీనా నాయక్, వైదిక సిబ్బంది, అర్చకులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు.