హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తిగా మంచినీటి పథకం పనులు

W.G: ఉంగుటూరు మండలం బాదంపూడిలో రక్షిత మంచినీటి పథకం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. దీంతో పథకం అటకెక్కింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.